ఏనుకూరు మండలానికి హార్టికల్చర్ అధికారి ఉన్నట్లా..? లేనట్లా..?
ఏనుకూరు మండలానికి ఉద్యానవన శాఖ అధికారి ఉన్నట్ల? లేనట్లా?

దిశ, ఏన్కూర్: ఏనుకూరు మండలానికి ఉద్యానవన శాఖ అధికారి ఉన్నట్ల? లేనట్లా? అనే సందేహం రైతులకు కలగక మానడం లేదు. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు జరుగుతుంది. 5 వందల ఎకరాల్లో పామాయిల్ పంట, సుమారు వంద నుంచి 120 ఎకరాలు కరివేపాకు సాగు, 200 ఎకరాల్లో, కూరగాయలతో పాటు ఆకుకూరల సాగు జరుగుతుంది. ఈ పంటలు సాగు సమయంలో వచ్చే చీడ పీడ నివారణ కోసం ఏ మందు పిచికారి చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితి ఉంది. సాగు కోసం అధిక పెట్టుబడి పెట్టి దిగుబడి సమయంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అదే సంబంధిత ఉద్యాన వన శాఖ అధికారి అందుబాటులో ఉండి సలహాలు సూచనలిస్తే మాకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది కానీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏనుకూరు మండలం లో సుమారు 4 ఎకరాల్లో వివిధ రకాల ఉద్యానవన పంటలు సాగు జరుగుతుంది. రైతులు ప్రత్యాన్మయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోయినప్పటికీ, రైతుల స్వయంగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఉద్యానవన పంటల వైపు ఆసక్తి కనబరిచి సాగు చేస్తున్న, హార్టికల్చర్ అధికారి సలహాలు సూచనలు ఇచ్చేందుకు కంటి చూపు కూడా కనపడటం, రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. విధులు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు సమర్పించి కాలం వెళ్ళ దీసే అధికారులు పట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పూర్తిస్థాయిలో ఏనుకూరు మండలానికి ఉద్యానవన శాఖ అధికారి బాధ్యతలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులకు వచ్చే సందేహాలను తీర్చే విధంగా విధులు నిర్వహించాలని పంట సాగు చేస్తున్న రైతులు కోరుతున్నారు.
మాకు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవారు లేరు : మాలోత్ నంద్యా రైతు
మేము కూరగాయల పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ తమకు తెలిసిన విధంగా బెండ, బీర, వంగ, ఇతర ఆకుకూరలు సాగు చేయడం జరుగుతుందని, పంట సాగు సమయంలో ఒక్కరోజు కూడా ఉద్యానవన శాఖ అధికారి వచ్చి సలహాలు సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవని, అసలు అధికారం ఉంటాడన్న విషయం కూడా మాకు తెలియదు.