దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలి : కలెక్టర్
ఆలింకో (ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ) పరికరాలను దివ్యాంగులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పంపిణీ చేశారు.

దిశ, కొత్తగూడెం : ఆలింకో (ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ) పరికరాలను దివ్యాంగులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అలింకో వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆనంద ఖని ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాలు, ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయక పరికరాల కోసం అలింకో స్క్రీనింగ్ క్యాంపు ను తేది.24.08.2024 రోజున నిర్వహించడం జరిగింది. మొత్తం 387 పిల్లలు హాజరు కాగా అందులో 288 విద్యార్థులు వివిధ రకాల ఉచిత ఉపకరణాలకు ఎంపిక కావడం జరిగింది.
ఎంపికైన వివిధ మండలాలకు చెందిన 288 పిల్లలకు మొత్తం 348 పరికరాలు మంజూరయ్యాయి. ఈ మంజూరైన ఉపకరణాలను కలెక్టర్ దివ్యాంగ బాలలకు పంపిణీ చేసి, తదుపరి పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే అన్ని సదుపాయాలను దివ్యాంగులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. దివ్యాంగులు అంటే దృఢ సంకల్పం కలవారు అని, వైకల్యం కలవారు కాదు అని అన్నారు . ఉదాహరణకు తన తోటి విద్యార్థిని మానసి జోషి గురించి మాట్లాడుతూ, ఆక్సిడెంట్ లో కాళ్ళు కోల్పోయిన కూడా దృఢ నిశ్చయం తో ఆడి, పారా ఒలింపిక్ ఆటలలో గోల్డ్ మెడల్ సాధించారని అన్నారు. అదే దృఢ సంకల్పంతో దివ్యాంగ విద్యార్థులందరూ ఎదగాలని ఉజ్వల భవిష్యత్ ను పొందాలని సూచించారు.
కలెక్టర్ పంపిణీ చేసే ఉపకరణాలను పరిశీలిస్తూ, దివ్యాంగ పిల్లలతో, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆత్మస్థైర్యంతో దివ్యాంగ విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటు ను అందిస్తున్న ఐ ఈ ఆర్ పి లను, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్ చారి, జిల్లా సమ్మిలిత విద్య కోఆర్డినేటర్ యస్. కె. సైదులు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనినా, నాగరాజ శేఖర్, ప్రధానోపాధ్యాయులు మంగీలాల్, అలింకో ఇన్చార్జి సురుష, మోహిత్ , ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, ఐఈ ఆర్ పి లు, దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.