సంబరాలు సరే మా సమస్యల పరిష్కారం ఏమైంది.. సీపీఐఎంఎల్ నాయకులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినాయని సంబరాలు చేసుకునే రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మా సమస్యల పరిష్కారం ఏమైంది అంటూ ప్రశ్నించారు.
దిశ, సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినాయని సంబరాలు చేసుకునే రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మా సమస్యల పరిష్కారం ఏమైంది అంటూ ప్రశ్నించారు. సీపీఐఎంఎల్ పార్టీ స్టేట్ సెక్రటరీ పోట్రు రంగారావు, సీపీఐఎంఎల్ తలపెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష దీక్షదివాస్ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి పాత సెంటర్ మసీదు రోడ్డు నందుగల సీపీఐఎంఎల్ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన గిరిజనులు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ స్టేట్ సెక్రెటరీ పోట్రు రంగారావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కాకముందే దశాబ్ది సంబరాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నిధులు నీళ్ళు నియామకాలు పేరుతో సంపండ వర్గాలను మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తెలంగాణ రాకముందు గిరిజనులకు గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలిచ్చి హక్కు కల్పిస్తామన్న కేసీఆర్ హామీలన్నీ విస్మరించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తామని మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఐదులక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇప్పించాలని, ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని, రైతులకు సబ్సిడీ ధరలకే ఎరువులు విత్తనాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోడు భూముల పై కేసీఆర్ తీసుకొచ్చిన జీఓ పంచ పాండవులు మంచం కోళ్లు లా ఉందని అలా కాకుండా 2006 చట్టం ప్రకారం పోడు భూముల పట్టా హక్కులు కల్పించాలని ఆయన కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెలం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉందని, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు వానొస్తే వెలవెల, గాలివస్తే గలగలలా తయారైందని అన్నారు.
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి హక్కు కల్పించాలి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ గెలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 12 తేదీ వరకు తలపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా 12వ తారీకు జిల్లా కలెక్టరేట్లు ముట్టడిని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ప్రజలే తమకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో టి శ్రీనివాసరావుకు పలుడిమాండ్లతో కూడిన వినత పత్రం అందజేశారు. దీనికైనా స్పందించి డిమాండ్ల పరిష్కారానికి ఉన్నదా అధికారులకు నివేదించి డిమాండ్ల పరిష్కార దిశగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోట్రు రంగారావు, సీపీఐఎంఎల్ రాష్ట్ర సెక్రెటరీ, గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి, జి శ్రీనివాసరావు సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకులు, తాటి రాము, సీపీఐఎంఎల్ మండల కార్యదర్శి, కందిమల్ల ప్రసాదు మండల నాయకులు, కొర్స వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ మండల నాయకులు గంట వెంకట నరసమ్మ, సీపీఐఎంఎల్ మండల నాయకురాలు పి.దుర్గా, ముఖ్యనాయకులు కార్యకర్తలు, గిరిజనులు గిరిజన ఇతరులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.