కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లింది : ఎమ్మెల్యే సండ్ర

కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, దానికి నిదర్శనం ఇదే నియోజకవర్గం అభ్యర్థి సంభాని చంద్రశేఖర్ తో పాటు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరటం అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.

Update: 2023-11-09 09:05 GMT

దిశ,సత్తుపల్లి : కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, దానికి నిదర్శనం ఇదే నియోజకవర్గం అభ్యర్థి సంభాని చంద్రశేఖర్ తో పాటు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరటం అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ముందు సత్తుపల్లి లో ప్రముఖ దేవాలయాల్లో, చర్చిల్లో మసీదులో సర్వమత ప్రార్థనల్లో పాల్గొని పట్టణ పరిధిలోని స్థానిక హనుమాన్ నగర్ లో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. పక్కా లోకల్ అంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, తుమ్మల, పొంగులేటి, ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

    సత్తుపల్లిలో గత 15 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉండి ప్రతిపక్ష పార్టీ నాయకులు నమస్కరించే సంస్కారం మాదని అన్నారు. సత్తుపల్లిలో మేమేంటో ప్రజలందరికీ తెలుసని, మరోసారి తప్పకుండా ఆశీర్వదిస్తారని అన్నారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే సండ్ర గెలుపునకు కృషి చేయాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మొదట గెలిచేది సత్తుపల్లి అని అన్నారు. ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా

    ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గెలుపు ఖాయం అయిందని, మెజార్టీ కోసమే తమ ప్రయత్నం అని అన్నారు. అనంతరం హనుమాన్ నగర్ నుంచి అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, పలు మండలాల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీగా వెళ్లి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:    

Similar News