పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో అబిజీత్ బేరా తనిఖీ.. విద్యుత్ షాక్ ఘటనపై ఆరా

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డ విషయం తెలిసిందే.గత ఆరు నెలల క్రితం ఇదే పాఠశాలలో

Update: 2023-07-30 08:12 GMT

దిశ, కూసుమంచి:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డ విషయం తెలిసిందే.గత ఆరు నెలల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అశ్వస్థకు గురైన ఘటన మరువకముందే విద్యుత్ షాక్ ఘటనతో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థి మృతి నేపథ్యంలో ప్రిన్సిపాల్ చంద్రబాబును సస్పెండ్ చేస్తూ నవోదయ విద్యలయ డిప్యూటీ కమిషనర్ టి. గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పాలేరు జవహర్ నవోదయ ఇంచార్జి ప్రిన్సిపల్ గా నల్గొండ జెఎన్ వీ ప్రిన్సిపల్ గా నాగభూషణం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

విద్యాలయంలో 467 మంది విద్యార్థిని, విద్యార్థులకు గాను సుమారు 300 మంది విద్యార్థులు శనివారం విద్యాలయంలో జరిగిన ఘటన భయందోళనకు గురిచేయగా హోమ్ సిక్ లివ్ పై తమ ఇండ్ల బాట పట్టారు. విద్యార్థులతో పారిశుధ్య పనులతో పాటు టాయిలెట్స్, శుభ్రం చేపించడం ఏంటని, విద్యార్థుల తల్లితండ్రులు సిబ్బందిని ప్రశ్నించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యుదాఘాతానికి గురైన ఓ విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో విద్యాలయాన్ని నవోదయ విద్యాలయాల సమితి హైదరాబాద్ రీజనల్ అసిస్టెంట్ కమిషనర్ అబిజీత్ బేరా విద్యాలయ ఆవరణలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ప్రమాదానికి గల పూర్తి వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాలయంలో మృతి చెందిన విద్యార్థి హళావత్ దుర్గా నాగేందర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


Similar News