17 మంది మావోయిస్టులు లొంగుబాటు
చత్తీస్-గఢ్ బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియా కమిటీకి చెందినవారు.

దిశ, భద్రాచలం : చత్తీస్-గఢ్ బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా గంగులూరు ఏరియా కమిటీకి చెందినవారు. లొంగిపోయిన 17 మందిలో తొమ్మిది మందిపై 24 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ మావోయిస్టు కమాండర్ దినేష్ ద్వారా ఈ 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారం రోజుల క్రితం పోలీసుల ఎదుట గంగులూరు ఏరియా కమిటీ కమాండర్ దినేష్ మొడియం దంపతులు లొంగిపోయారు.