మునుగోడు BRS నేత పల్లె రవికుమార్‌కు కీలక బాధ్యతలు

రాష్ట్ర గీత కార్మిక సహ‌కార ఆర్థిక సంస్థ కార్పొరేష‌న్ చైర్మన్‌గా సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్‌ నియామకం అయ్యారు.

Update: 2023-05-04 15:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గీత కార్మిక సహ‌కార ఆర్థిక సంస్థ కార్పొరేష‌న్ చైర్మన్‌గా సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్‌ నియామకం అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ప‌ల్లె ర‌వి కుమార్ రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించలేదు. తొలి చైర్మన్‌గా పల్లె రవి నియామకం అయ్యారు.

టీడీపీ ప్రభుత్వంలో కటికం సత్తయ్యగౌడ్, రామాగౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపాలనకాలంలో మాచర్ల జగన్నాధం, బండి నర్సాగౌడ్ నియామకం అయ్యారు. నాడు కోట్ల రూపాయలను గీత కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించేవి. సంక్షేమానికి పాటుపడ్డాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 9ఏళ్లలో కార్పొరేషన్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపే చూస్తుందని గౌడసంఘం నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్ కు నిధులు లేవు, కనీసం భవనం కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ తో ముగిస్తుందా? కార్పొరేషన్ కు నిధులు ఏమైనా కేటాస్తుందా అని చూడాలి.

Tags:    

Similar News