మేం భరతమాత, దేశ ప్రజలకే బానిసలం: CM రేవంత్‌కు మహేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీకి బానిసల్లా పని చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-07-24 09:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీకి బానిసల్లా పని చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎల్పీ లీడర్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మేం భారతమాత, దేశ ప్రజలకు మాత్రేమనని బానిసలమని, మీరే రాహుల్ గాంధీకి బానిసలై ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రానికి ఏ రాష్ట్రం మీద వివక్ష ఉండదని అన్నారు. అసలు ఏపీ విభజన చట్టం తెచ్చింది ఎవరు.. రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరని ప్రశ్నించారు.

నియమాలు, నిబంధనలు తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. బయ్యారంలో లభ్యమయ్యే ముడిసరుకు థర్డ్ గ్రేడ్ అని నివేదిక వచ్చిందని గుర్తు చేశారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని అంటున్నారని.. మూసీ నది సుందరీకరణకు సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి మీరు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏపీకి పది వేల కోట్లు ఇచ్చారని పదే పదే చెప్పడం సరికాదన్నారు. ఏపీ నిధులు ఇస్తే తెలంగాణ ఎలా ఏడారిగా మారుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి సభలో తమను మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని ఫైర్ అయ్యారు.


Similar News