TS: జూనియర్ లెక్చరర్ పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగే లీకేజీలకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగే లీకేజీలకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించింది. మరోపక్క.. జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పేపర్ 2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పేపర్ 2 ఆంగ్లంలోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పేపర్ 2 ప్రశ్నపత్రం ఇంగ్లీషు, తెలుగులో ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించింది.