3 నెలల్లోనే బీఆర్ఎస్‌కు ఎంతమంది గుడ్ బై చెప్పారో తెలుసా?
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన ఫలితాన్ని లోక్‌సభ ఎన్నికల్లో రిపీట్ కానివ్వొద్దని భావిస్తోన్న అధిష్టానానికి ఆ పార్టీ శ్రేణులు ఒకరి తర్వాత మరొకరు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా గుడ్ బై చెప్పేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన ఫలితాన్ని లోక్‌సభ ఎన్నికల్లో రిపీట్ కానివ్వొద్దని భావిస్తోన్న అధిష్టానానికి ఆ పార్టీ శ్రేణులు ఒకరి తర్వాత మరొకరు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా గుడ్ బై చెప్పేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి మూడు నెలలు కూడా కాకముందే ఏకంగా 15 మందికి పైగా పార్టీని వీడటం క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యం కోల్పోయేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావస్తున్నారు. అయితే, ఈ క్రమంలో ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యమం నుంచి కేసీఆర్‌ను నమ్ముకొని ఉన్నవారిని కాదని.. మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చర్చిస్తున్నారు. ఇప్పుడు పార్టీని వీడిన వారు కూడా రాజకీయ అవసరాల కోసం నాడు బీఆర్ఎస్‌లో చేరినవారే అని చెబుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం కళ్లు తెరిచి ఉద్యమం నుంచి వెంటనడిచిన సొంత లీడర్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన వారు..
ఎంపీ వెంకటేశ్ నేత
బొంతు రామ్మోహన్
తాటికొండ రాజయ్య
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
పట్నం మహేందర్ రెడ్డి
పట్నం సునీతా రెడ్డి
తీగల కృష్ణారెడ్డి
తీగల అనితారెడ్డి
బీజేపీలో చేరిన వారు..
ఎంపీ బీబీ పాటిల్
ఎంపీ రాములు
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు
మాజీ ఎంపీ సీతారాం నాయక్
మాజీ ఎంపీ జి.నగేశ్
మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్