నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై కేబినెట్‌లో కీలక నిర్ణయం

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు.. ఎదురుచూస్తున్న అనేక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Update: 2024-08-01 12:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు.. ఎదురుచూస్తున్న అనేక అంశాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందులో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్‌, మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం, ఇద్దరికి గ్రూపు-1 స్థాయి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వయనాడ్ బాధితులకు సాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News