పౌరసరఫరాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: ఉత్తమ్

రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2023-12-16 09:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని తెలిపారు. అంతేకాదు.. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ రూ.11 వేల కోట్ల అప్పుల్లో నడుస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అసెంబ్లీలో వాడివేడీగా చర్చలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, రాజనర్సింహా ధీటుగా తిప్పికొడుతున్నారు.

Tags:    

Similar News