‘నేను బద్దలయ్యే అగ్ని పర్వతంలా ఉన్న’.. కవిత అరెస్ట్‌పై KCR సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కూతురు కవిత అరెస్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్

Update: 2024-07-23 14:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కూతురు కవిత అరెస్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే నా కూమార్తెను జైళ్లో పెట్టారని ఆరోపించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా నాకు బాధగా ఉండదా.. ప్రస్తుతం నేను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడటంతో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న వ్యాఖ్యలకు సైతం గులాబీ బాస్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌ పార్టీ్కి క్లిష్ట పరిస్థితులు ఏమి లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మొన్నటి వరకు నలుగురు ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని తిరిగి ప్రశ్నించారు. అధికారంలో కంటే అపొజిషన్‌లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించలేకపోయిందన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని చురకలంటించారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతిభద్రతలు ఎందుకు తప్పుతాయని నిలదీశారు. ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే.. వాళ్లు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. 


Similar News