MLC: యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు వారు దూరంగా ఉండాలి

యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పారదర్శంగా జరగాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-09-02 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పారదర్శంగా జరగాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ సూచనలు అందరూ తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు జరుగకుండా ఉండాలంటే నాయకులు ఎన్నికలు దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ యువజన విభాగానికి ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

అధికారంలో కాంగ్రెస్‌ ఉండడం, సమీపంలో స్థానిక ఎన్నికలు రానుండడంతో అనుబంధ విభాగాల బలోపేతానికి పార్టీ రాష్ట్ర నేతలు సంకల్పించారు. రాష్ట్రస్థాయిలో యువజన విభాగ ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా, మండల, నియోజకవర్గ కమిటీలకు ఎన్నికల నిర్వహణకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 14 నుంచి యువజన కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు మొదలు కానుంది. సెప్టెంబర్‌లో యూత్‌ వింగ్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. కార్యకర్తలతో సభ్యత్వాలు చేయించి వారితో యూత్‌ వింగ్‌ నాయకులను ఎన్నుకుంటారు.


Similar News