CM KCR: భారత రాజకీయాల్లో మార్పు కోసమే బీఆర్ఎస్..
నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం పార్టీ జెండాను గులాబీ బాస్ ఆవిష్కరించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ప్రజల స్థితిగతులు మారలేదని, భారత దేశంలో పుష్కలమైన వనరులు ఉన్నా ప్రజలకు సరిపడా నీళ్లు, విద్యుత్ దుస్థితి ఎందుకుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గురువారం మహారాష్ట్ర నాగ్ పూర్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేసీఆర్ ఎన్నికల్లో గెలవడం పార్టీల లక్ష్యమైపోయిందన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనం అన్నారు. రాజకీయాలు నడుస్తుంటాయి కానీ అంతిమంగా ప్రజలు గెలవాలన్నారు. బీఆర్ఎస్ ఒక పార్టీ కాదని భారత రాజకీయాల్లో మార్పు కోసం ఏర్పడిన ఒక మిషన్ అన్నారు. రైతుల పక్షాన పోరాటంలో ఆకాశం, భూమిని ఒక్కటి చేసైనా ముందుకు సాగుతామన్నారు. ప్రజలు నక్షత్రాలు, చంద్రుడిని కోరడం లేదని సరిపడా తాగు, సాగునీరు, విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారని అది కూడా అసంభవంగా మారిందన్నారు. ఈ సమస్యలు తీర్చరడంలో పాలకులు ఇన్నేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
దేశంలో మార్పుకు మహారాష్ట్ర నుండి అడుగులు పడుతున్నాయని కృష్ణా, గోదావరి వంటి అనేక నదులు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ నీటి సమస్య ఎందుకు తీరడం లేదన్నారు. మహారాష్ట్రలో అనేక మంది సీఎంలు మారినా నీటి కష్టాలు మాత్రం ఎందుకు తీరలేదన్నారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. తమ పాలనలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పారు. ఇదే తెలంగాణ మోడల్ అని ఈ మోడల్ ను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామన్నారు. తాను నాందేడ్ వస్తే కేసీఆర్ కు ఇక్కడేం పని అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నాడని తెలంగాణ మోడల్ ను అమలు చేస్తే మహారాష్ట్రను వదిలేసి మధ్యప్రదేశ్ వెళ్తానని తాను చెప్పాన్నారు. త్వరలో నాయకులు దివాలా తీస్తారు. మహారాష్ట్ర జనం దివాళీ చేసుకుంటాన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మహారాష్ట్రను మార్చేయబోతోందన్నారు. ప్రస్తుతం మన దేశంలో దళితుల పరిస్థితి ఏంటి? ఆదివాసీలు తమ హక్కుల కోసం ఎన్నాళ్లు పోరాటం చేయాలి వీరి పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాకే అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నారు.
Read more: చంచల్‌గూడ జైలుకు అవినాశ్ రెడ్డి.. తండ్రితో ములాఖత్