కేసీఆర్ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారు: కేటీఆర్
తెలంగాణ కొత్త ప్రమాణ స్వీకారం వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పాత్రలో కూడా తాము రాణిస్తామని చెప్పారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని.. కొంతకాలమే ఉంటుందని తెలిపారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారని అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు సహజమని, నిరాశ చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని చెప్పారు. పోరాటాలు తమకు, తమ పార్టీకి కొత్త కాదని వెల్లడించారు.