శ్రీధర్ బాబు సీఎం అవుతారని ఆశిస్తున్నా.. BRS ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలను కుదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని.. పెద్దపల్లి జిల్లాను మారిస్తే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలను కుదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని.. పెద్దపల్లి జిల్లాను మారిస్తే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కదిలించొద్దని.. కదిలిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో మహా ఉద్యమానికి తాము సిద్ధం కావాల్సి వస్తుందని వెల్లడించారు. ఇచ్చిన గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ, హామీలు గుప్పించి.. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయాలని.. లేకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో లైట్ తీసుకున్నా.. చట్ట సభల్లో ప్రశ్నిస్తామని వెల్లడించారు. రెండు గ్యారంటీలు అమలు చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే 14 వేల కోట్లకుపైగా అప్పులు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సమర్ధత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని.. ఎందుకు ఓటు వేశామో అని బాధపడుతున్నారని గుర్తుచేశారు. కాగా, 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా భానుప్రసాద్ రావు గెలిచాడు.
Read More..
బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఆశిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు