కొత్త రేషన్ కార్డుల జారీపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందడానికి రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో రేషన్ కార్డునే ఎందుకు కొలమానంగా చూస్తున్నారని అందరి మనసుల్లో ఓ ప్రశ్న మెదలడం ఖాయం.

Update: 2024-02-26 13:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందడానికి రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డునే ఎందుకు కొలమానంగా చూస్తున్నారో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఏ కొలమానం లేకుండా పథకాలు వర్తింపజేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పథకాల అమలులో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం రెండూ జరిగాయని వెల్లడించారు. ఏకంగా హైవే రోడ్లకు కూడా రైతుబంధు నిధులు మంజూరు అయ్యాయంటే ఏ రేంజ్‌లో అవినీతి జరిగిందో ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం జరుగుతుందని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తామని మాటిచ్చారు. రేషన్ కార్డు నిబంధన లేకపోతే కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారని సరదాగా చెప్పారు. కొన్నే్ళ్లుగా వర్షాలు బాగా పడ్డాయని.. అందుకే భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ సారి వర్షాలు చాలా తక్కువగా పడటం మూలంగానే భూగర్భ జలాలు తగ్గాయని తెలిపారు. ఇప్పుడీ భూగర్భ జలాలను కేసీఆర్ పెంచుతాడా? అని ప్రశ్నంచారు. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగడం వల్లే వరి ఉత్పత్తి పెరిగిందని.. కాళేశ్వరం వల్ల కాదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News