ఎమ్మెల్యేగా KCR ఓటమి.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.

Update: 2023-12-05 06:26 GMT
ఎమ్మెల్యేగా KCR ఓటమి.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఎన్నికల వేళ బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణల బీఆర్ఎస్ పార్టీని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం.

మొదట కేసీఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం ఎదరుచూస్తున్నది.’ అంటూ రాసుకొచ్చారు. 

Tags:    

Similar News