వైరల్ వీడియో రైతును కలిసిన గులాబీ బాస్.. రెండో రోజు బస్సు యాత్ర

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మొదటి రోజు నుంచే ప్రజల్లో బస్సు యాత్రకు ఆదరణ లభిస్తోంది.

Update: 2024-04-25 12:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మొదటి రోజు నుంచే ప్రజల్లో బస్సు యాత్రకు ఆదరణ లభిస్తోంది. ఇవాళ రెండో రోజు యాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా గులాబీ బాస్ కేసీఆర్ భువనగిరి చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో కేసీఆర్ పాల్గొంటారు. యాత్రలో భాగంగా సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండా రైతు ధరావత్ నర్సింహ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. తన పొలం నీళ్లందక పూర్తిగా ఎండిపోయిందని రైతు ఆవేదన చెందారు.

కాగా తన 5 ఎకరాల వరి పంట ఎండిపోవడంతో ఎంతో ఆవేదనతో తన పొలంలోనే దుఃఖించిన ఈ రైతు వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, మే నెల 10 వరకు బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ఈ యాత్ర ముగుస్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.

Tags:    

Similar News