KCR : రంగంలోకి గులాబీ బాస్.. రైతుల కోసం బీఆర్ఎస్ మరోసారి పోరాటం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలల్లోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2024-08-29 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలల్లోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటం చేయనున్నట్లు తెలిసింది. రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు. ఈ బీఆర్ఎస్ పోరాటం పై రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

సెప్టెంబర్ మొదటి వారం గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహం పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News