ఎవ‌రెన్ని ట్రిక్స్ చేసినా KCR హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు

రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడ‌ర్ కావాలా..? రాంగ్ లీడ‌ర్ కావాలా..? ఎవ‌రు కావాలో ప్రజ‌లు, మేధావులు ఆలోచించాల‌ని మంత్రి హరీష్ రావు సూచించారు.

Update: 2023-08-25 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడ‌ర్ కావాలా..? రాంగ్ లీడ‌ర్ కావాలా..? ఎవ‌రు కావాలో ప్రజ‌లు, మేధావులు ఆలోచించాల‌ని మంత్రి హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలు భేష్ అని, కర్ఫ్యూలు లేవు.. బంద్‌లు లేవు అన్నారు. ఎవ‌రెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దేన‌ని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌ రావు బీఆర్ఎస్‌లో చేరారు.

మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడవు కానీ, ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, రాష్ట్రానికి పేపర్‌ లీడర్‌ కావాలా, ప్రాపర్‌ లీడర్‌ కావాలా ప్రజలు ఆలోచించాలని కోరారు.

కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో రాష్ట్రం ఉన్నందునే 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేసీఆర్ తొమ్మిదేళ్లలోనే చేసి చూపారని, సురక్షిత పాలనను అందిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందో చూడాలని సూచించారు. కొంతమంది నాయకులు కావాలనే విమర్శలు చేస్తున్నారని వారిని పట్టించుకోవద్దన్నారు. తెలంగాణ ఫార్మా హబ్‌నే కాకుండా నేడు హెల్త్‌ హబ్‌, ఐటీ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వ‌న్ స్థానంలో ఉందని, వైద్యుల ఉత్పత్తిలోనూ నెంబర్ వ‌న్‌గా ఉందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30శాతం డెలివరీలు జరిగితే, నేడు 72.8 శాతానికి పెరిగాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఒకనాడు నాడు ఎంబీబీఎస్‌ చదవాలంటే ఇత‌ర‌ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్‌ చదివే అవకాశం దక్కిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. మన రాష్ట్ర విధానాన్ని చూసి కేంద్రం ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ విధానాన్ని తీసుకువ‌చ్చింద‌ని వెల్లడించారు.

తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని అవార్డులు రివార్డులు తెలంగాణకు వస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ హార్ ఘార్ జల్‌గా, రైతు బంధు పెడితే కేంద్రంపీఎం కిసాన్ సమ్మాన్‌గా కాఫీ కొట్టారన్నారు. కుల వృత్తులను ఆదుకునేందుకు బీసీ బందు పెడితే... కేంద్రం కుడా కాఫీ కొట్టారన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్ పడిందని, ఈ సంక్షేమ పథకం ద్వారా సామాజిక మార్పు వచ్చిందని, ఇంటింటికి నీళ్లు ఇవ్వడం ద్వారా సీజనల్ వ్యాధులు పోయాయన్నారు. నీటి కోసం చేపట్టిన సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లు నేడు లేవు అన్నారు.

కేసీఆర్ కిట్ ద్వారా శిశు మరణాలు, మాతృ మరణాలు తగ్గాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసమే సంక్షేమ పథకాలు అన్నారు. తెలంగాణతో పోల్చుకునేందుకు దరిదాపులో ఏ రాష్ట్రం లేదని, అందరి మద్దతు కేసీఆర్ కు మద్దతివ్వాలని.. సీఎంగా మూడోసారి హ్యాట్రిక్ విజయం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, సూడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌ రావు, బీఆర్‌ఎస్‌ నాయకుడు భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News