KCR క్షమాపణ చెప్పాలి.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్‌కు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-06-16 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ శనివారం జస్టిస్ నరసింహారెడ్డికి కమిషన్‌కు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, కేసీఆర్ లేఖపై బీజేపీ రాజ్యసభ ఎపీ లక్ష్మణ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖ హాస్యాస్పదం అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణ న్యాయ కమిషన్‌పై కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. కమిషన్‌పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటకు రావాలన్నారు. రేవంత్ సర్కారు విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు అన్నారు.


Similar News