Gummadi Narsaiah : కేసీఆర్ నియంత... రేవంత్ ప్రజల మనిషి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య(Gummadi Narsaiah) తాజా, మాజీ సీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-19 15:18 GMT
Gummadi Narsaiah : కేసీఆర్ నియంత... రేవంత్ ప్రజల మనిషి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. సామాన్యుడిలా జీవితం గడుపుతున్న కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య(Gummadi Narsaiah) తాజా, మాజీ సీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) అన్నీ నేనే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ కొనియాడారు. తమ జిల్లాకు చెందిన పలు సమస్యలను ఆయనకు వివరించేందుకు తగిన సమయం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని.. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు ఇచ్చారని, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఏళ్లు గడిపారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు పదుల ఎకరాలు ఉన్నవాళ్లకు ఇవ్వకుండా ఆపేశారని.. ఆది మంచి నిర్ణయం అని, పేద ప్రజలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం మంచి విషయం అని గుమ్మడి నర్సయ్య తెలియజేశారు. 

Also Read..

మందకృష్ణ నా కంటే ఎక్కువ వాళ్లనే నమ్ముతుండు.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు 

Tags:    

Similar News