ఆ పని చేతకాదని మనల్ని ఎగతాళి చేసేవాళ్లు: CM KCR కీలక వ్యాఖ్యలు

గతంలో తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదంటూ మనల్ని ఎగతాళి చేసేవారని.. కానీ ఇప్పుడు మనం కట్టుకున్న ఆఫీసులే వారికి సమాధానం అని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2023-08-23 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదంటూ మనల్ని ఎగతాళి చేసేవారని.. కానీ ఇప్పుడు మనం కట్టుకున్న ఆఫీసులే వారికి సమాధానం అని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. ఆ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా బాగాలేవన్నారు. నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారని.. వచ్చే రోజుల్లో పెన్షన్ పెంచుకుందామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఒకప్పుడు కాలువలు, చెరువులు ఎలా ఉండేవని.. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయన్నారు. అధికారుల కృషి వల్లే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు. 

Tags:    

Similar News