గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదు: మహేష్​ కుమార్ ​గౌడ్​

రాజకీయాల్లో హైట్.. వెయిట్‌తో పనిలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు.

Update: 2023-05-09 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో హైట్.. వెయిట్‌తో పనిలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ​కుమార్​ గౌడ్ ​పేర్కొన్నారు. ప్రజాధరణ ఉంటే సరిపోతుందన్నారు. రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన మంగళవారం సోషల్​మీడియాల్లో పోస్టు చేశారు. మంత్రిగా విలువలు కాపాడుకోవాలని, లేదంటే ప్రజలు బుద్ది చెబుతారన్నారు. యూత్​డిక్లరేషన్​సభ సక్సెస్​కావడంతోనే బీఆర్ఎస్​నేతలకు మతి భ్రమిస్తుందన్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు కేసీఆర్ అండ్​సర్కార్‌కు లేదన్నారు. సోనియమ్మ దయతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల పోరాటానికి విలువ దక్కిందన్నారు. కేసీఆర్, శ్రీనివాస్​యాదవ్ ఇంట్లో ఎవరూ త్యాగం చేయలేదన్నారు. మోండా మార్కెట్‌లో మాట్లాడినట్లు రాజకీయాల్లో వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News