రిజర్వేషన్లపై మా స్టాండ్ ఇదే.. తేల్చిచెప్పేసిన KCR

రిజర్వేషన్ల రద్దు అంశం తెలంగాణ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-07 04:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వేషన్ల రద్దు అంశం తెలంగాణ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. ముస్లింలకు కల్పించిన మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం రిజర్వేషన్ల రద్దు అని.. బీజేపీ ఎజెండా సైతం రిజర్వేషన్ల రద్దు అని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల రద్దు అంశంపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తమ స్టాండ్ ఏంటో తేల్చిచెప్పారు. దళిత ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు ఉన్నచోట దళిత రిజర్వేషన్ లేకపోతే వాళ్లను గెల్వనిస్తారా అన్నారు. కాబట్టి ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని తెలిపారు. రిజర్వేషన్లు అమలులో ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అని కేసీఆర్ తేల్చిచెప్పారు.  


Similar News