బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ఉన్నది అతనే.. తెలంగాణ బీజేపీ ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై తెలంగాణ బీజేపీ ఆరోపణలు గుప్పించింది.

Update: 2024-06-25 07:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే సమీక్షించే నాథుడేలేరని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పరిపాలనను గాలికి వదిలేసి ఢిల్లీ టూర్లకు వెళ్తుండటం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఆరు నెలల వ్యవధిలో 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి ఇంకా పాలనపై పట్టు సాధించలేదని విమర్శించారు. పాలనలో మూడు బదిలీలు.. ఆరు సస్పెన్స్ లుగా సాగుతోందని.. ఆరు నెలల కాలంలో మూకుమ్మడి బదిలీల పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని దీంతో అధికారులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారన్నారని విమర్శించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల ఫిరాయింపు జరగుతోందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కొత్త ప్రయోగం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకులం అని పనులు మొదలు పెట్టారని వీటి పనులు ఏ దశలో ఉన్నాయో సమీక్షించకుండానే ఇండిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ఏంటని ప్రశ్నించారు.

Tags:    

Similar News