తెలంగాణ తల్లి విగ్రహం ఆ ప్లేస్‌లో పెట్టాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్‌లోని సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇవాళ మండలిలో మాట్లాడింది. రాష్ట్ర సెక్రటెరియట్‌కి, అమరజ్యోతికి రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్న స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆ ప్లేస్‌లో ఫౌండేష్ స్టోన్ కూడా నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తున్నారని, మార్చిన తర్వాతనైనా ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే.. ఒక పక్క అమరవీరుల స్థూపం, సెక్రటేరియట్ ఉన్న చోట విగ్రహం ఉంటే బాగుంటదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వేరే ఎక్కడైనా పెట్టొచ్చు.. కానీ ఒక ప్రదేశాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎవరి సూచనలు తీసుకోకుండా.. పిలువకుండా ఆ ప్లేస్‌ను రాజీవ్ గాంధీ స్టాచ్యూ కోసం హాడావుడిగా ఆగమేగాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం భాదాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు.