బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి..

మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.

Update: 2025-03-23 09:07 GMT
బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి..
  • whatsapp icon

దిశ, గన్నేరువరం : మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. దీంతో కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వ్యక్తిగత కారణాల మూలంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు కుసుంబ నవీన, యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News