వాగు దాటాలంటే సాహసం చేయాల్సింది.. భారీ వర్షానికి రాకపోకలు అస్తవ్యస్తం

ఆ ఊరి ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒకటే

Update: 2024-08-16 15:03 GMT

దిశ,కొడిమ్యాల : ఆ ఊరి ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒకటే దడ.. ఎందుకంటే వాగు దాటుకుంటూ ఇంటికి చేరాలి. మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనాపూర్ గ్రామస్తుల వానా కాలపు గోస ఇది. మండల కేంద్రానికి ఏదైనా పనిమీద వచ్చి వెళ్లాలంటే వర్షాకాలంలో సుమారు మూడు వాగులు దాటుకుంటూ వెళ్లాలి. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి దాటలేని పరిస్థితి వచ్చింది అంటే  ఫీట్లు చేస్తూ తాడు సహాయంతో వాగులు దాటుతుంటారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమకు ఈ వర్షాకాలపు బాధలు తప్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


Similar News