అంగన్వాడీ కేంద్రాల్లోని కోడిగుడ్లలో పురుగులు

ఇటీవల ఎక్కడ చూసినా అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే కోడిగుడ్లలో పురుగులు రావడం సహజంగా మారింది.

Update: 2024-10-22 11:19 GMT

దిశ, ముస్తాబాద్ : ఇటీవల ఎక్కడ చూసినా అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే కోడిగుడ్లలో పురుగులు రావడం సహజంగా మారింది. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో 5వ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భిణులు తినే కోడిగుడ్లలో పురుగులు రావడం కలకలం రేపింది. పోతుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం అంగన్వాడీకి వెళ్లి కోడిగుడ్లను తీసుకువచ్చి చూడగా అవి కుళ్లిపోయి వాటిలో నుంచి పురుగులు బయటికి రావడం గమనించాడు. వెంటనే అంగన్వాడీ టీచర్​ను నిలదీయడంతో వారు వాటిని పడేశారని బాధితుడు తెలిపాడు. గ్రామస్తుడు కోల కృష్ణ తదితరుల ద్వారా ఉన్నతాధికారి అంజలికి విషయం తెలియజేయగా కుళ్లిన గుడ్లు రావడంపై ఆరా తీసి ఏజెన్సీ పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Tags:    

Similar News