పాపన్న ముసుగు తీసేది ఎప్పుడు..?
శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జాతీయ రహదారి పక్కన
దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జాతీయ రహదారి పక్కన బస్టాండ్ కు ఎదురుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రసమయి బాలకిషన్, శంకరపట్నం మండల గౌడ కుల సంఘ పెద్దలు కలిసి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటపై తిరుగుబాటు బావుట ఎగరవేసి స్వాతంత్ర కాంక్షను ఆకాంక్షించిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఇంకా ముసుగుతోనే ఉంది. వర్ధంతి జయంతుల ను ముసుగుతోనే నిర్వహిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవానికి నోచుకోక మహనీయునికి నివాళులర్పించాలన్న ,జయంతి ఉత్సవాల నిర్వహించాలన్న మరో చిత్రపటాన్ని ముందు పెట్టి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నాయకులు స్పందించి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ వీలైనంత తొందరగా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.