తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలి : కలెక్టర్

తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు.

Update: 2024-11-08 10:06 GMT

దిశ, మేడిపల్లి : తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండల కేంద్రంలోని మన్నెగూడెం, దమ్మన్నపేట, వల్లంపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి సంబంధిత రైస్ మిల్లుకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీ ఓ రఘువరన్, ఆర్డీఓ జి.వాకర్ రెడ్డి, తహసీల్దార్​లు రవి కిరణ్, వసంత, సివిల్ సప్లై అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీఓ నీరజ, ఏపీఎం, కమిటీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News