ప్రభుత్వ లాంఛనాలతో వీర జవాన్ అనిల్ అంతిమ యాత్ర
హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో ప్రమాదానికి గురై గురువారం నది ప్రాంతంలో కుప్పకూలిపోయిన ఘటనలో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ అనిల్ అంతిమయాత్రను శనివారం స్వగ్రామంలో ప్రభుత్వం లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
దిశ, కోనరావుపేట : హెలికాప్టర్ సాంకేతిక సమస్యలతో ప్రమాదానికి గురై గురువారం నది ప్రాంతంలో కుప్పకూలిపోయిన ఘటనలో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ అనిల్ అంతిమయాత్రను శనివారం స్వగ్రామంలో ప్రభుత్వం లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. వీర జవాన్ అనిల్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినిపల్లి మండలం మల్కపూర్ గ్రామం. శనివారం ఆర్మీ జవాన్లు నేతృత్వంలో అధికార లాంఛనాలతో అంతిమయాత్ర ఘనంగా నిర్వహించారు.
మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, ఆర్డీవో పవన్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు, న్యాయకులు అంతమయాత్రలో పాల్గొని అనిల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతిమయాత్ర ఆధ్యంతం జై జవాన్.., వీర జవాన్ అనిల్ అమర రహే.. నినాదాల నడుమ కొనసాగింది. ఆర్మీ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపి అన్ని ప్రభుత్వ లంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు.