సరిహద్దులు దాటుతున్న సహజ వనరులు..
ఎల్లారెడ్డిపేట మండలం, ముస్తాబాద్ మండలాలకు మధ్య గల
దిశ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం, ముస్తాబాద్ మండలాలకు మధ్య గల రామలక్ష్మణ పల్లె నుండి ప్రతి రోజు పదుల సంఖ్యలో టిప్పర్లు 20కి పైగా ట్రాక్టర్ లలో ఇసుక ప్రతినిత్యం అక్రమ రవాణా కొనసాగుతుంది. ముస్తాబాద్ మండలం లోని రామ లక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి నిత్యం ఇసుక రవాణా జరుగుతున్న ఇటు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.అదే పద్ధతిలో ఇసుక దందా కొనసాగుతోంది. ఇలా ముస్తాబాద్ మండలంలోని రామ లక్ష్మణ పల్లి గ్రామంలో మొదట లేబర్ తో ఇసుక తట్టలతో ఎత్తించి ఒక చోట పోయిస్తారు.ఒక రోజుకు సుమారు 20 ట్రిప్పుల ఇసుక ను మానేరు నుంచి తీసుకువచ్చి ఒక చోట డంప్ చేస్తారు. లేబర్ తో ఇసుక ఎత్తే పరిస్థితి లేకుంటే మానేరు వాగులోకి ఫ్రంట్ బ్లెడ్ తో నీళ్లలో ఉన్న ఇసుకను తీసుకువచ్చి భారీ మొత్తంలో డంప్ చేస్తారు.అక్కడి నుండి జెసీబీ ద్వారా మూడు టిప్పర్ల లో రెండు బొలెరోలలో ఇసుక ట్రాక్టర్ల ద్వారా సిద్దిపేట కు, హైదరాబాద్ లాంటి పట్టణాలకు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.
చక్రబంధంలో మానేరు వాగు..?
మానేరు వాగు ప్రతి వారంలో నాలుగైదు రోజులు నిత్యం రామలక్ష్మణ పల్లి వాగు నుంచి ప్రతి నిత్యం ఇసుక అక్రమ రవాణా చేస్తుండడానికి ఇసుక స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మండలంలోని కొండాపూర్ ఎల్లమ్మ వాగు వద్ద ఒక్కరు, వెంకటాపూర్ స్టేజీ వద్ద ఒక్కరు, పొత్ గల్ స్టేజి వద్ద ఒకరు, సిద్దిపేట వెళ్లే మార్గంలో ఒక టీమ్ మానేరు వాగులోకి వచ్చేపోయే వారి వివరాలు సేకరించిన తర్వాత వదిలివేస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి వాహనాలు సైతం లాక్కుంటారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదంతా పోలీస్ యంత్రాంగానికి తెలిసి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదాలు జరిగినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయని పోలీసులు..?
గతంలో రామలక్ష్మణ పల్లె మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతుండగా పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను ముస్తాబాద్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా నామాపూర్ గ్రామ శివారులో సదరు ట్రాక్టర్ యజమాని ట్రాక్టర్ చెరువులో పడగొట్టగా బ్యానెట్ పై కూర్చున్న కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలైన చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. కాగా ఇసుక అక్రమ రవాణా పోలీసులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.