పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే నిర్వహణ : పెద్దపల్లి కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న

Update: 2024-12-19 13:45 GMT

దిశ,పెద్దపల్లి : ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ చౌరస్తా వద్ద 35వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ను జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే పై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలని, ప్రజలు సైతం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్ లతో సహకరించాలని కలెక్టర్ సూచించారు.

ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యుమరేటర్ లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్ రూపొందించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితి గతి తెలిసేలా ఫోటో యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియలో ఎటువంటి పొరపాటు రావడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News