ఎమ్మెల్యేని మించిన మోసగాడు లేడు..

కూనారం గ్రామసర్పంచ్ డొంకన విజయ మొగిలి, వెన్నంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ పనస మల్లయ్య కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పివారిని ఆహ్వానించారు.

Update: 2023-10-27 12:43 GMT

దిశ, కాల్వశ్రీరాంపూర్ : కూనారం గ్రామసర్పంచ్ డొంకన విజయ మొగిలి, వెన్నంపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ పనస మల్లయ్య కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పివారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డొంకన మొగిలి, పనాసమల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు అహర్నిశలు కష్టపడి గ్రామంలో పార్టీని ముందుండి నడిపించి మనోహర్ రెడ్డి రెండు సార్లు గెలవడానికి ముఖ్య భూమిక పోషించినా, ఆ పార్టీలో ఉండలేక అవమానాలు ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లువారు అన్నారు. మోసం చేయడంలో ఎమ్మెల్యే మించిన మోసగాడు లేడు అనితెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామనణరావు గెలుపు కోసం కృషి చేస్తానని వారు తెలిపారు. ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం సరిగా లేదని, డబ్బున్న రాజకీయ నాయకుడని, ఉద్యమ కారులను అణిచివేస్తూ, తెలంగాణ వ్యతిరేకులను అందలమెక్కిస్తూన్నాడని, డబ్బు సంచులు ఎర చూపినా లొంగకుండా, సర్పంచ్ డొంకన విజయ మొమౌళితో పాటు కూనారం వార్డు సభ్యులు వెన్నంపల్లి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ పనస మల్లన్న, మాజీ ఎంపీటీసీ కొమురయ్య, వెళ్తురు రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అలాగే సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీఎంపీపీ సారయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గాజన వేణ సదయ్య, పెద్దపెల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ మునీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సర్పంచు మాదాసు సతీష్, కలిముద్దీన్, సజ్జు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అల్లంల దేవేందర్ యాదవ్, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, నాయకులు రానా వీణ శ్రీనివాస్, క్రాంతి కుమార్, లంక సదయ్య, అరెల్లి రమేష్ ఆయా గ్రామాల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News