రసాభాసగా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం..
శంకరపట్నం మండలంలోని కేశవ పట్నం గ్రామంలో బుధవారం నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ పునః నిర్మాణ కార్యక్రమంలో రసాభాస నెలకొంది.
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవ పట్నం గ్రామంలో బుధవారం నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ పునః నిర్మాణ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. ఎమ్మెల్యే ముందే ఆలయ కమిటీ సభ్యులు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేని ముందు పెట్టుకొని ఎమ్మెల్యేను ఆహ్వానించి మీరు ఎలా పునర్నిర్మాణ కార్యక్రమానికి కొబ్బరికాయలు కొడతారంటూ ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఆలయ కమిటీ మెంబర్లలోని సభ్యుడైన ఓ పాత్రికేయుడు టీపీసీసీ సభ్యున్ని ఎదురు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
కవ్వంపల్లి సత్యనారాయణ కాసేపు ఎం జరుగుతుందో అని అలా చూస్తూ ఉండిపోయారు. ఆలయ కమిటీ సభ్యులు వ్యవహరించిన తీరు పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కావాలనే ఎమ్మెల్యేను అవమానపరిచారని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యేను గుడి పునర్ నిర్మాణ శంకుస్థాపనకు పిలిచి అవమానించారని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిని వెలుబుచ్చారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఓ పత్రికకు సంబంధించిన విలేకరి కాసేపు హంగామా సృష్టించాడు. గొడవ సద్దుమనిగిన అనంతరం మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ఏది ఏమైనా పవిత్ర కార్యంలో ఆధిపత్య పోకడలు కనిపించాయని నమ్మకం లేనప్పుడు ఎమ్మెల్యేను ఎందుకు పిలిచినట్లు అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.