ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆశా వర్కర్ల డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 15న నిర్మల్ లో మొదలైన బస్ జాతా బుధవారం జగిత్యాలకి చేరింది.

Update: 2024-12-18 11:52 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : ఆశా వర్కర్ల డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 15న నిర్మల్ లో మొదలైన బస్ జాతా బుధవారం జగిత్యాలకి చేరింది. జిల్లాలో ఉన్న ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి యూనియన్ నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐటీయూ మహిళా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు 18000 ఫిక్స్డ్ శాలరీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

    బస్ జాతా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి డిసెంబర్ 31న రాష్ట్ర రాజధానిలోని ఇందిరాపార్క్ వద్ద ముగింపు కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకుంటే డిసెంబర్ 31 తర్వాత కార్యాచరణ ప్రకటించి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


Similar News