"దిశ" కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్.. అధికారులకు షోకాజ్ నోటీసులు

దిశ కథనానికి కథనానికి మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్ స్పందించారు.

Update: 2024-08-17 06:02 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: దిశ కథనానికి స్పందన లభించింది. సిరిసిల్ల మున్సిపల్ "అధికారుల నిర్లక్ష్యంతో అంధకారంలో ఆఖరి మజిలీ, సెల్ ఫోన్ లైట్లతో అంత్యక్రియలు" అనే శీర్షికను శనివారం ఉదయం "దిశ" దిన పత్రిక వెబ్ సైట్ లో ప్రచురించింది. దిశ కథనానికి మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్ స్పందించారు. నెహ్రూ నగర్ స్మశాన వాటికను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. నిర్లక్ష్యం వహించిన సదరు అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా విద్యుత్ రిపేరులతో పాటు మట్టి రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్ స్పందన పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ యాజమాన్యానికి, విలేఖరులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 


Similar News