Ramagundam CP: రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడమే ప్రధాన లక్ష్యం
పెద్దపల్లి పట్టణంలో కూనరం క్రాస్ రోడ్, కమాన్ చౌరస్తా, అయ్యప్ప టెంపుల్
దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలో కూనరం క్రాస్ రోడ్, కమాన్ చౌరస్తా, అయ్యప్ప టెంపుల్ ఏరియా, బస్ స్టాండ్ మరియు మంథని ఫ్లై ఓవర్ చౌరస్తా లో వద్ద ట్రాఫిక్ సిగ్నల్ సిస్టం ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్, ఐ ల్యాండ్స్, సిసి కెమెరాల ఏర్పాటుకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మరియు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ లతో కలిసి పరిశీలించారు
సీపీ మాట్లాడుతూ....జాతీయ రహదారుల సంబంధించిన వారు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి ,సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ శాఖ వారు కలిసి కమిషనరేట్ లోని అన్ని రోడ్ల సమగ్ర సమాచారం, ఏ రోడ్డుపై ఎక్కడెక్కడ క్రాసింగ్స్, ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రధాన పట్టణంల గుండా ఉన్న ప్రధాన రహదారిపై అధిక వాహనాల రాకపోకలు ,రద్దీ కారణంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ట్రాఫిక్ సిగ్నల్స్ ను, ఐల్యాండ్స్, సిసి కెమెరాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగా ముఖ్యమైన ప్రధాన కూడాళ్ళ ను ముందుగా గుర్తించి ప్రధాన రహదారి ఫై ఈ సిగ్నల్స్ ఏర్పాటు వలన ప్రమాదాలు జరగడం తగ్గుతుంది ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, ట్రాఫిక్ మేనేజ్మేంట్ కు ఉపయోగపడుతుంది అని అన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు వలన ప్రమాదాల నివారణ, అధిక వేగంగా ప్రయాణం చేసేవారిని నియంత్రణ చేయవచ్చు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు తో ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయి.ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి అన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది .జాతీయ రహదారులపై స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే అవకాశం లేదని అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలను , స్పీడ్ బ్రేకర్స్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాల వద్ద హెచ్చరికలు, సూచనలు చేసే బోర్డులను రేడియం స్టిక్కరింగ్ తో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు.