మూడు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

Update: 2025-01-04 09:54 GMT

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గట్టపల్లి, శివాలయం మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్ నుంచి జెండా వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైయిన్ పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్టు సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలిపోయే స్థితికి వచ్చినందున, నూతన భవనం మంజూరైందని, ప్రస్తుత విద్యార్థులను అనువైన మరో భవనానికి తరలించి పాత భవన తొలగింపు పనులు ప్రారంభించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News