బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర సందర్భంగా కొడిమ్యాలలో పాదయాత్ర చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దిశ, కొడిమ్యాల: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర సందర్భంగా కొడిమ్యాలలో పాదయాత్ర చేస్తుండగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ సంజయ్‌కి చెందిన వాహనాలపై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న కొందరు రాళ్లు విసరడంతో వివాదం చెలరేగింది. దీంతో బీజేపీ నాయకులు అక్కడే ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడి పై కోపంతో దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు అకారణంగా దాడికి పాల్పడ్డారంటూ నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సీఐ నీలం రవి స్థానిక ఎస్సై సందీప్ కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించివేశారు.