చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు.. మల్లాపూర్ ఎస్సై కొసన రాజు..
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లాపూర్ ఎస్సై కోసనా రాజు ఓ ప్రకటనలో తెలిపారు.
దిశ, మల్లాపూర్ : చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లాపూర్ ఎస్సై కోసనా రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డిసెంబర్ 31 రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం, బాణాసంచాలు పేల్చడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒక్కసారి కేసులు నమోదైతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇదిలావుంటే, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు నూతన సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఎస్సై కే రాజు సూచించారు.