నిద్రిస్తున్న వృద్ధురాలి పై పిచ్చి కుక్కల దాడి
మండలం లో మరోసారి పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దిశ, ముస్తాబాద్: మండలంలో మరోసారి పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సేవాలాల్ తండా గ్రామంలోని (బట్టోనితాళ్ళు)లో పిట్ల రాజలక్మి( 80) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో పిచ్చి కుక్కలు ఇంట్లో ప్రవేశించి రాజ్యలక్ష్మి పై గుంపుగా దాడి చేశాయి. మొదటగా గొంతు పై దాడి చేసి చంపి రాజ్యలక్ష్మి శరీరంలో అవయవాలు పిచ్చి కుక్కలకు తిన్నాయి. ఉదయం స్థానికులు చూసే సరికి రాజలక్మి తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. రాజలక్మి మరణ వార్తతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణానికి కారణమైన కుక్కను చంపేసినట్లు స్థానికులు తెలిపారు.