పారిశుద్ధ్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
పారిశుద్ధ్య అధికారులు, సూపర్ వైజరీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ఆ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ), కమిషనర్ ( ఎఫ్ఏసీ ) జె. అరుణ శ్రీ ఆదేశించారు.
దిశ, గోదావరిఖని : పారిశుద్ధ్య అధికారులు, సూపర్ వైజరీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ఆ పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ), కమిషనర్ ( ఎఫ్ఏసీ ) జె. అరుణ శ్రీ ఆదేశించారు. శనివారం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ది పనులను పరిశీలించారు. మల్కాపూర్ లోని ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని సందర్శించారు.
రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల సర్వే నమోదు ర్యాండమ్ చెక్ చేశారు. రెండు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లక్ష్మీనగర్ , కళ్యాణ్ నగర్ లలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రామగుండం నగర పాలక సంస్థ ఎస్ఈ శివానంద్, అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, ఈఈ రామన్ తదితరులు ఉన్నారు.