కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సిందే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సిందేనని, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
దిశ, జమ్మికుంట: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సిందేనని, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గౌడన్నల ఆత్మీయ సమ్మేళనాన్ని హుజురాబాద్ నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షులు పల్లె ప్రశాంత్ గౌడ్, అధ్యక్షతన జమ్మికుంట పట్టణంలో గౌడన్నల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
అనంతరం అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో 8% రిజర్వేషన్ ఉన్న అగ్ర కులాల వారు రాజ్యాంగంలో 10 శాతం రిజర్వేషన్ తీసుకోవడం బహుజనులను దోపిడీ చేయడమే అని, 52% ఉన్న బహుజనులకు కేవలం 27% రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ హక్కులను వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత కేవలం 6 నెలల్లోనే 70 కోట్ల రూపాయలను మద్యం స్కాంలు సంపాదించిందని ఆరోపించారు. బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.