ప్రాణాలు మింగేస్తున్న ఆర్ఎంపీ వైద్యం..?

ఎల్లారెడ్డిపేట మండలం లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జజ్జరీ

Update: 2024-12-28 08:59 GMT

దిశ,ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జజ్జరీ దేవేందర్ అనే ఆర్ఎంపీ వైద్యుడు తెలిసి తెలియని వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు కలవు. గంభీరావుపేట మండలం తురకాశి పల్లె కు చెందిన షేక్ ఖాసీం బీ (32)అనే మహిళ కు శుక్రవారం రాత్రి చలి జ్వరం వస్తుందని ట్రీట్మెంట్ కోసం దేవేందర్ వద్దకు వెళ్ళింది.కాగా వైద్యం చేయడం తో షేక్ ఖాసీం బీ కి గ్లూకొజ్ పెట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా సదరు డాక్టర్ ఆమెను తన కారులో తీసుకుని ఎల్లారెడ్డి పేట లో గల ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం వేకువ జామున తుది శ్వాస విడిచింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రి కి తరలించారు. జజ్జరీ దేవేందర్ అనే ఆర్ ఎం పి వైద్యుడికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం షరా మామూలే అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

మండలంలో ఎవరైనా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని స్థానికంగా నయం అయ్యే పరిస్థితి ఉన్న ఎదో సాకు చెప్పి రోగులను బయపెట్టించి కరీంనగర్, హైదరాబాద్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి కమిషన్ విధానం లో భారీగా డబ్బులు తీసుకుంటాడనే ఆరోపణలు వినవస్తున్నాయి.ఇంట్లో ఒక ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేసి వచ్చిరాని వైద్యం చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.గతంలో కూడా ఓ పెషేంట్ తన వద్దకు రాగా వైద్యం చేయగా వైద్యం వికటించి ఒకరు అదే విధంగా హెర్నియా వ్యాధితో బాధపడుతూ చనిపోగా అప్పట్లో కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం.అంతే కాకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా మార్చడం ఇతడికి ఆనా వాయితీగా మారింది. తాజాగా ఖాసీం భీ అనే మహిళ కు దేవేందర్ వైద్యం చేయగా వికటించి చనిపోయింది. ఇప్పటికి వచ్చి రాని వైద్యం తో ఇతడు తీసిన ప్రాణాల సంఖ్య భారీగానే ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆబర్షాన్ కేసులు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి భారీగానే డబ్బులు సంపాదించినట్లు తెలిసింది.

ఖాసీం బీ చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆర్ ఎంపీ వైద్యుడు దేవేందర్ రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబం తో సహా పరారయ్యాడు. మృతురాలి కుటుంబీకులు ఎప్పుడు దాడి చేస్తారోనని భయంతో పరారయ్యాడు. మృతురాలి కుటుంబీకులు దాడి చేస్తారనే అనుమానం తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నేరెళ్ల రమాకాంత్ ఆధ్వర్యంలో దేవేందర్ ఇంటి వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.


Similar News