ఆహార భద్రత కల్పించే దిశగా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌

రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు సరసమైన

Update: 2024-03-10 15:47 GMT

దిశ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌: రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) దేశంలో వ్యవసాయోత్పత్తిని పెంచడం కోసం రైతులకు సరసమైన ధరలకు తగినంత, సకాలంలో యూరియాను అందించడానికి మేక్‌ ఇన్‌ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ అని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పౌరులందరికీ ఆహార భద్రత కల్పించే దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీజీఎం సుధీర్‌ కుమార్‌ జా అన్నారు. శనివారం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా 350 రేక్‌ల యూరియాను పంపింది. ఈ సందర్భంగా సీజీఎం సుధీర్‌ కుమార్‌ రేకుల యూరియా రవాణా గూడ్స్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-2024లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తెలంగాణ, పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 10.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వేప పూతతో కూడిన యూరియాను పంపిందని తెలిపారు.

ఇందులో తెలంగాణకు 418805.64 మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 144198.90 మెట్రిక్‌ టన్నులు, కర్ణాటకకు 166322.70 మెట్రిక్‌ టన్నులు, మహారాష్ట్రకు 69860.43 మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌కు 78051.15 మెట్రిక్‌ టన్నులు, తమిళనాడుకు 93770.73 మెట్రిక్‌ టన్నుల, మధ్యప్రదేశ్‌కు 63217.98 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తరుపున సీజీఎం సుధీర్‌ కుమార్‌ పెద్దపల్లి కలెక్టర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు, భారతీయ రైల్వే, ఇతర వాటాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Similar News